Telugu

September 25, 2011

శ్రీ విజయవాడ కనకదుర్గ దేవి నవరాత్రి అలంకారములు

ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుండి దసమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు దుర్గా దేవికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు జరుపుట ఆనవాయతి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు

కొంతమంది తమ ఇంట్లో ఆహవనీయ అగ్ని, గ్రహపత్య అగ్ని, దక్షిని అగ్ని అను హోమాలు రోజూ జరుపుకుంటారు. ఇవే కాకుండా అదిత్య హొమము మహాసూర్య మంత్రాలను పఠిస్తూ జరుపుతారు. ఈ హొమములు చేయుట వలన ఇంటి ఆవరణం మహా శక్తి మయమై, ఇంటి వాతావరణం ఎల్లప్పుడు స్వచ్చంగా వుండును.

శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.

విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగలలో దేవీ నవరాత్రులు అత్యంత ప్రధానమైనవి. శరదృతువులో ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.

ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ పది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.

శ్రీ  దేవి నవరాత్రి  ప్రతి పూజ విధానము, మాత్రములు,శ్లోకాలు,నైవేద్యము తెలుసుకొనుటకు  అమ్మవారి అలంకారము మీద Click చేయండి..

మొదటి రోజు:   శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

రెండొవ రోజు:   శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

మూడొవ రోజు:   శ్రీ గాయత్రీ దేవి

నాల్గొవ రోజు:    శ్రీ అన్నపూర్ణా దేవి

ఐదొవ రోజు:      శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

ఆరొవ రోజు:      శ్రీ మహాలక్ష్మీ దేవి

ఏడొవ రోజు:      శ్రీ సరస్వతీ దేవి

ఎనిమిదొవ రోజు:   శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )

తొమ్మిదొవ రోజు:   శ్రీ మహిషాసుర మర్దినీ దేవి  ( మహర్నవమి )

పదొవ రోజు:     శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

tags: శ్రీ  కనకదుర్గ దేవి  నవరాత్రి అలంకారములు, శ్రీ  విజయవాడ కనకదుర్గ దేవి  నవరాత్రి అవతారములు, sri kanakadurga devi navarathri pula, day1, day2, day3, day4, day5, day6, day7, day8, day9, day10, navarathri 10 days avatharamulu, free pooja vidhanulu, devi nvarathri prasadam, mantras, slokas, pujas, saran navarathri pujas, 9 days navarathri, kanadurga devi alankaramulu 2011, avathrams of ammavaru, sri vijayawada avatars, sri durga devi dail navrathri puja process

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URL

Leave a comment

Powered by WordPress