Telugu

February 22, 2010

భక్త రామదాసు కీర్తనలు – ఏ తీరుగ నను దయ చూచెదవో


ఏ తీరుగ నను దయ చూచెదవో – శ్రీ రామదాసు కీర్తన

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా..
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా..
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

భక్త రామదాసు కీర్తనలు – పలుకే బంగారమాయెనా

 పలుకే బంగారమాయెనా – శ్రీ రామదాసు కీర్తన

లుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ

ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ

ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ

రాతి నాతిగ చేసి భూ తలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష

భక్త రామదాసు కీర్తనలు – ఇక్ష్వాకు కులతిలక

ఇక్ష్వాకు కులతిలక  - శ్రీ రామదాసు కీర్తనలు

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

February 12, 2010

శ్రీ శివాష్టకం

Filed under: నమః శివాయ,అష్టకములు — admin @ 9:53 am

shivashtakam in telugu

శ్రీ శివాష్టకమ్

ప్రభుం ప్రాణనాథం  విభుం విశ్వనాథం జగన్నత నాథం సదానంద భాజం
భావద్ భవ్యభుతేయ్స్వరం భుతనాథం శివం శంకరం శంభు మిశానమిడే ||

గలే రుండమాలం తనవ్  సర్పజాలం మహాకాల కాలం  గానేశాది పాలం
జటాజుట గంగాతరంగైర్విశాలం  శివం శంకరం  శంభు మిశానమిడే  ||

ముదామకరం  మండనం  మండయంతం  మహామండలం  భస్మభూషా ధరాoతంతమ్
అనాది హ్యపారం  మహామోహారూపం శివం శంకరం  శంభు మిశానమిడే  ||

వటాధో  నివాసం  మహాట్టాట్టహాసం  మహాపాపనాశం సదా సుప్రకాశం
గిరీశం  గణేశం  సురేశం మహేశం శివం శంకరం  శంభు మిశానమిడే   ||

గిరీద్రత్మజ సమగృహితర్ధదేహం  గిరావ్  సంస్థితం  సర్వదా పన్నగేశం
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంధ్యమానం  శివం శంకరం శంభుమిశానమిడే  ||

కపాలం  త్రిశూలం  కరభ్యం  దధానం పదామ్రోజ నమ్రాయ  కామం  దాధానం
బలీవర్దమానం సురాణం  ప్రధానం  శివం శంకరం శంభుమిశానమిడే   ||

శరచ్చంద్రగాత్రం  గూణానంద పాత్రం  త్రినేత్రం  పవిత్రం  ధనేశస్య  మిత్రం
అపర్ణ కళాత్రం సదా సచ్చరిత్రం  శివం  శంకరం  శంభుమిశానమిడే  ||

హారం సర్పాహారం  చితాభువిహారం భావంవేదసారం  సదా నిర్వికారం
స్మశానే వసంతం  మనోజం దహంతం శివం శంకరం శంభు మిశానమిడే  ||

స్వయం యః  ప్రభాతే  నరః శులపాణీ  పటేత్  స్తోత్రరత్నం  త్రిహప్రప్యారత్నం
సుపుత్రం సుభాగ్యం  సుమిత్రం  కళత్రం విచిత్రై  సమారాధ్య  మోక్షం  ప్రయాతి  || 

tags: shivashtakam online telugu, shivastakam in telugu, sivasktakam, astakam, sivashtakam, sivashtakam,

February 11, 2010

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

shiva panchakshari in telugu

శివునికి అత్యంత ప్రేతికరమయినది శివ పంచాక్షరి. పంచాక్షరీ అంటే పంచ అక్షరములు – న మః శి వా య.
ఈ స్తోత్రములో ప్రతి అక్షరములో శివుని మహిమ వెల్లడి అవుతుంది.

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం 

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ బస్మంగా రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ  శుద్ధాయ దిగంబరాయ తస్మై  “న” కారయ  నమఃశివాయ   1

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర  ప్రమధనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై “” కారయ నమఃశివాయ  2

శివాయ గౌరీ వదనారవిoద సూర్యాయ దాక్షాద్వర నాశకాయ
శ్రీ నీలకంటాయ వృషద్వజాయ తస్మై  “శి”కారయ  నమఃశివాయ  3

వశిష్ట కుంభోద్భవగౌతమాది మునీంద్ర  దేవార్చిత  శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై  “వ” కారయ  నమఃశివాయ  4

యక్షస్వరూపాయ జటాధరాయ పినాక  హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై  “య” కారయ  నమఃశివాయ 5

పంచాక్ష మిదం పుణ్యం యః  పట్ఎత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి   శివేన  సహమోదతే

tags: shiva panchankshara strotram, siva panchakshari in telugu, shiva panchakshari stotram in telugu, telugu stotram, shiva panchakshari, siva panchakshara stotra, lord shiva panchakshari, telugu slokams, sloka in telugu , lord shiva panchakshari strotram, online telugu lo panchakshari stotram , downlaod,lord shiva pujas in telugu free

February 10, 2010

మహా మృత్యుంజయ మంత్రము

Filed under: నమః శివాయ,మంత్రములు — admin @ 8:07 am

maha mrityunjaya mantra

మృత్యుంజయ మంత్రము 

ఓం  త్రయంబకం  యజామహే సుగంధిం  పుష్టివర్ధనం

ఉర్వారుకమివ  బంధనాత్ మ్రిత్యోర్ ముక్షియ యమామృతాత్

tags: Mrityunjaya Mantra,  mrutyunjaya mantra in telugu, telugu mantras, slokas, in telugu, Mrutyunjaya Mantra, shiva mantras, lord shiva slokas, mrutryunjaya mantras, murutyunjaya mantra

Powered by WordPress