Telugu

October 13, 2012

శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

దసరా శరన్నవరాత్రి మహౌత్సవాల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా అలంకరి స్తారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. ఒక పసిబాలుని మృతికి కారణమైన తనకుమారు డికి మరణ శిక్ష విధిస్తాడు మాధవవర్మ అనే రాజు. ఆయన ధర్మబుద్ధికి మెచ్చి అమ్మ కనకవర్షం కురిపించిందట.

ఈ కారణంగా శరన్నవరాత్రుల తొలిరోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అలంకారంతో తీర్చిదిద్దుతారు. ఆది శంకరాచార్యులవారు చేసిన ‘సౌందర్య లహరి’ స్తోత్రానికి అమ్మవారు మెచ్చి కనకం కురిపించింది.

శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.

శ్రీ దుర్గాష్టకం

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

Tags: durga avataraas first day, modati roju avatar og kanaka durga, bejawada kanaka durga first avatharamu

September 29, 2011

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారము

 
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.

శ్రీచక్రార్చన, కుంకుమార్చన చేయవలెను.

శ్రీ రాజ రాజేశ్వరి అష్టోత్తర శతనామావళి

శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్

లలితా సహస్రనామము  OR  శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నమ్

 పారాయణము చేయవలెను.

లడ్డూలు నివేదన చెయ్యాలి.    

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags:  sri rajarajeswari devi devi avatharmu,శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారము, దేవి నవరాత్రి ,rajaraswari puja, raja rajeshwari pooja, lastday of navarathi, 9th day, 10th da y navarathri pooja, devi pooja , prasadam, navarathri 10 days pooja free

శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అవతారము

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.

అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామావళి

మహిషాసుర మర్ధినీ స్తోత్రము

చండీ   సూక్తం ( దుర్గ సూక్తం) 

పారాయణం చేయవలెను.

నివేదన: చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నివేదన చేయవలెను.    

శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri mahishasura marshi devi avatharmu,శ్రీ మహిషాసుర మర్ధిని దేవి అవతారము, నవరాత్రి అలంకారములు, kanakadurga devi mahisasura alankaramulu, 8th day of navarathri pooja, 9th day navrathri puja, in telugu, mahishaura marsini puja free online, sri mahishashura madini mantras, 10 day navrathri in telugu, 2011 kanakaduraga amma avatars

శ్రీ దుర్గా దేవి అవతారము

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రమును  పఠించాలి.

శ్రీ దుర్గ అష్టోత్తర శత నామావళి

దుర్గా సూక్తము

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

పఠించవలెను.

నివేదన: పులగము నివేదన చెయ్యాలి. 

శ్రీ దుర్గా దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri durga devi avataramu, శ్రీ దుర్గా దేవి అవతారము, అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi pooja, 6th day of navarathri pooja, devi navarathri poojalu, దేవి నవరాత్రి పూజ, in telugu, devi pooja , sri durgapuja, navarathri durga pooja, navarathri 10 days daily pooja free, sri kanadurga ammvarau darshanam, mantramulu, slokas in navratri

September 28, 2011

శ్రీ సరస్వతి దేవి అవతారము

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.  

శ్రీ సరస్వతి అశోత్తరములు OR 108 శ్రీ సరస్వతి స్తోత్రములు నామములు

శ్రీ సరస్వతి దేవి స్తోత్రంమ్

శ్రీ సరస్వతి దేవి ద్వాదశ నామ స్తోత్రంమ్

పారాయణం చేయవలెను.

శ్రీ సరస్వతి దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri saraswathi devi avatahrmu, sri saraswathi navarathri puja, 6th day avatharamu, free 5th avatharamu devi navarathri avatharamulu, saraswathi puuja vidhana, poojalu, telugu lo navarathri pooja, 10 daya navarathir avataras

శ్రీ అన్నపూర్ణ దేవి అవతారము

దసరా ఉత్సవాలలో  అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు “అమ్మ” అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.

పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.

మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత  మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
నివేదన: దధ్యన్నము, కట్టెపొంగలి

అన్నపూర్ణ అష్టోత్తర శత నామావళి

శ్రీ అన్నపూర్ణాష్టకమ్

పారాయణం చేయవలెను.

శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri annapoorna devi devi avatharmu,శ్రీ అన్నపూర్ణ దేవిఅవతారము,  అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi annaporna alankaramulu, 4th day of navarathri pooja, 3rd day navarathri daily navarathri poojalu, దేవి నవరాత్రి పూజ, in telugu, devi pooja , annaporna devi parayanam, prasadamu, navarathri prasadamulu, ammavaru 10 days puja

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారము

శ్రీ లలితా త్రిపుర సుందరీ

దసరా నవరాత్రులలో అమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.

చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి.

కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.

మంత్రము: “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను.

శ్రీచక్రానికి కుంకుమార్చన చేయవలెను.

లలితా అష్టోత్తర శత నామములు (108 names)

శ్రీ లలితా పంచరత్న స్తోత్రం

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము  OR శ్రీ లలితా సహస్త్రనామ స్తోత్రం

పారాయణం చేయవలెను.

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri lalitha devi devi avatharmu,శ్రీ లలిత దేవి అవతారము, అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi lalitha devi alankaramulu, 5th day of navarathri pooja, 1 to10 days navarathri poojalu, దేవి నవరాత్రి పూజలు, in telugu,  sri lalitha thripura sundari devi puooja telugu, lalitha puja stotram,4th day navarathri prasadamulu,lalitha thripurasundari puja

September 27, 2011

శ్రీ మహా లక్ష్మి దేవి అవతారము

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.

డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.

యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితాఅంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను.

శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి

శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్

శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము

శ్రీ సూక్తం

పఠించవలెను. 

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

శ్రీ మహా లక్ష్మి దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags :  sri mahalakshmi devi devi avatharmu,శ్రీ మహా లక్ష్మి దేవి అవతారము,  అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi mahalakshmi pooja alankaramulu, devi navarathri poojalu, దేవి నవరాత్రి పూజ, vijayawada kanaka durga devi ammavaru, sri devi navarathri parayanam, prasadham, sri devi navathula pooja, 1 days navaratri amma pictures

శ్రీ గాయత్రి దేవి అవతారము

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే

శరన్నవరాత్రులలో అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి.   గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజొవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

గాయత్రీ అశోత్తరములు OR 108 గాయత్రీ స్తోత్రములు నామములు

పారాయణ చేసి అల్లపు గారెలు నివేదన చేయాలి. 

గాయత్రీ మంత్రము

“ఆం  భూర్  భువః  స్వాహా ,
తట్  సవితుర్  వరేణ్యం
భర్గో  దేవస్య  ధీమహి
ధియో  యో  నహ  ప్రచోదయాత్ “

శ్రీ  గాయత్రి దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

tags: sri gayathri devi avatharmu,శ్రీ గాయత్రి దేవి అవతారము,  అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi navarathri gayathri alankaramulu, navarathri poojalu, దేవి నవరాత్రి పూజ, telugu lipi, in telugu, devi pooja , indrakiladri ammavaru alankaramu, sri vijayawada kanakadurga gayathri ammavaru, sri devi navarathri parayanam, prasadham

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారము

  
 
 హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్
 
రన్నవరాత్రి ఉత్సవములలో దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి. 

శ్రీ బాలా త్రిపురసుందరీ అశోత్తరములు

శ్రీ బాలా త్రిపురసుందరీ స్తోత్రము

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నమ్

పటించవలెను.

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః  అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.

త్రిశతీ పారాయణ చేసి అమ్మవారికి పాయసము నివేదన చెయ్యలి.

శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారము (శ్రీ దేవి నవరాత్రి అలంకారము) రోజు చేయవలసిన పూజ విధానము ఈ దిగువున ఉన్నది…..

 

tags: bala thripura sundari avatharamu, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారము, దేవి నవరాత్రి అలంకారములు, kanakadurga devi navarathri alankaramulu, daily navarathri pooja, దేవి నవరాత్రి పూజ, telugu lipi, in telugu, devi pooja , durga devi pujas in navarathri, 2011 devi alankaras, vijayawada kanakadurga bala thirupurasundari photos, ammavari avathramulu free

Older Posts »

Powered by WordPress